
సినిమాలు

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న తీరుపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గత సాంకేతిక విప్లవాలతో పోలిస్తే ఏఐ పూర్తిగా భిన్నమైనదని, మానవాళికి ఇది అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ది న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐ వినియోగంపై పన్ను విధించాలని, దానిని ‘టోకెన్ ట్యాక్స్’గా పిలవాలని ప్రతిపాదించారు. ఏఐతో ఉద్యోగులను భర్తీ చేయడం కంపెనీలకు ఖరీదైనదిగా మారేలా పన్ను విధానం ఉండాలని సూచించారు. అలాగే కొన్ని ఉద్యోగాలను కేవలం మనుషులకే పరిమితం చేయాలని అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!