3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..

Writer: Chandrika 03:42 PM, 3 సెప్టెంబర్, 2026
ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..

ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌ రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. ఫేబుల్‌ 5.1, మైథోస్‌ 5.1 పేర్లతో తీసుకొచ్చిన ఈ మోడళ్లు కోడింగ్‌, పరిశోధన, సైబర్‌ సెక్యూరిటీ, బయాలజీ వంటి అధునాతన రంగాలపై దృష్టి సారించాయి. ఫేబుల్‌ 5.1ను సాధారణ వినియోగానికి అందుబాటులోకి తీసుకురాగా.. మైథోస్‌ 5.1ను సైబర్‌ సెక్యూరిటీ, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో పనిచేసే ఎంపిక చేసిన నిపుణులు, సంస్థలకు మాత్రమే అందిస్తున్నారు. గత మోడల్‌ ఫేబుల్‌ 5తో పోలిస్తే కొత్త వెర్షన్‌ క్లిష్టమైన, ఎక్కువ సమయం పట్టే పనుల్లో మెరుగైన పనితీరు కనబరుస్తుందని ఆంత్రోపిక్‌ తెలిపింది. సాధారణ వర్క్‌లోడ్లకు దాదాపు 25 శాతం, అత్యంత ఏజెంటిక్‌ వర్క్‌లోడ్లకు 45 శాతం వరకు ఖర్చు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ప్రాసెస్‌ చేసిన సమాచారాన్ని మళ్లీ ఉపయోగించుకునే క్యాష్‌ రీడ్స్‌ ధరను 75 శాతం తగ్గించడంతో ఈ వ్యయ ప్రయోజనం సాధ్యమవుతుందని వివరించింది.

కొత్త మోడళ్ల సామర్థ్యాలను సాఫ్ట్‌వేర్‌, శాస్త్రీయ పరిశోధనల్లోనూ పరీక్షించినట్లు ఆంత్రోపిక్‌ వెల్లడించింది. ఏళ్లుగా పరిష్కారం కాని ఓ సాఫ్ట్‌వేర్‌ క్రాష్‌కు కారణమైన సమస్యను ఫేబుల్‌ 5.1 గుర్తించిందని సంస్థ తెలిపింది. అలాగే మైథోస్‌ 5.1 ప్రోటీన్‌ డిజైన్‌ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిందని పేర్కొంది. 12 టార్గెట్లపై రూపొందించిన డిజైన్లలో దాదాపు సగం ఉపయోగకరమైన ప్రోటీన్‌ బైండర్లుగా నిర్ధారించబడినట్లు తెలిపింది. నాసా మ్యాజెలన్‌ మిషన్‌ డేటాను ఉపయోగించి శుక్ర గ్రహంలోని దాదాపు మూడో వంతు ప్రాంతానికి అధిక రిజల్యూషన్‌ ఎలివేషన్‌ మ్యాప్‌ను రూపొందించడంలోనూ ఫేబుల్‌ 5.1 పనిచేసిందని వెల్లడించింది. మరోవైపు సైబర్‌ సెక్యూరిటీ దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు భద్రతా వ్యవస్థలను కూడా అప్‌డేట్‌ చేసింది. ఫేబుల్‌ 5.1లో అనవసరమైన జోక్యాలను తగ్గించే రక్షణ వ్యవస్థలను అమలు చేయగా.. మైథోస్‌ 5.1ను అధునాతన సామర్థ్యాల కారణంగా ప్రస్తుతం ఎంపిక చేసిన నిపుణులకే పరిమితం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..

సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. మాస్ మార్కెట్‌పై ఫోకస్!

సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. మాస్ మార్కెట్‌పై ఫోకస్!

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం

కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం

ట్యాగ్లు
ఆంత్రోపిక్‌ఫేబుల్‌ 5.1మైథోస్‌ 5.1కృత్రిమ మేధస్సుఏఐ మోడళ్లుసైబర్‌ సెక్యూరిటీఏఐ పరిశోధనకోడింగ్‌ ఏఐప్రోటీన్‌ డిజైన్‌లైఫ్‌ సైన్సెస్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ
జనరల్

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...
సినిమాలు

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్
సినిమాలు

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్

రీ రిలీజ్‌లోనూ పవన్ కళ్యాణ్ పంజా సత్తా.. అదిరిపోయే కలెక్షన్స్!
సినిమాలు

రీ రిలీజ్‌లోనూ పవన్ కళ్యాణ్ పంజా సత్తా.. అదిరిపోయే కలెక్షన్స్!

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!
సినిమాలు

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..
టెక్నాలజీ

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..
టెక్నాలజీ

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..

ఆకృతి చౌదరి NSA నిర్బంధం రద్దు చేసిన అలహాబాద్ హైకోర్టు
జనరల్

ఆకృతి చౌదరి NSA నిర్బంధం రద్దు చేసిన అలహాబాద్ హైకోర్టు

200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు
జనరల్

200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు

నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం
జనరల్

నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం

మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని
జనరల్

మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని

కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన
జనరల్

కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!