

అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏఐ టెక్నాలజీని వేగంగా వినియోగిస్తున్నాయని పీడబ్ల్యూసీ సంస్థ తెలిపింది. ‘ఏఐ ఎడ్జ్ ఫర్ వికసిత్ భారత్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో, 2035 నాటికి భారత్‌లో ఐదు ప్రధాన రంగాల్లో ఏఐ వాటా 550 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. వ్యవసాయం, ఆరోగ్యం, ఇంధనం, విద్య, తయారీ రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని నివేదిక పేర్కొంది.
వ్యవసాయ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పీడబ్ల్యూసీ తెలిపింది. ఎక్కువ మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే కావడంతో ఉత్పాదకత సవాళ్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. దిగుబడులు పెంచాలంటే, దీర్ఘకాలిక స్థిరత్వం కోసం ఏఐ, డిజిటల్ సాధనాలు తప్పనిసరిగా అవసరమని నివేదిక స్పష్టం చేసింది. ఇంధన రంగం తయారీ, వ్యవసాయ వృద్ధికి కీలక సహాయకారిగా పనిచేస్తుందని తెలిపింది.
వైద్య రంగంలో ఏఐ ద్వారా రోగ నిర్ధారణ మెరుగుపడుతుందని, జిల్లా ఆసుపత్రులతో అనుసంధానమైన వైద్య కళాశాలల వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది. తయారీ రంగంలో సెమీ కండక్టర్లు, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్‌లో ఏఐ వృద్ధికి దోహదపడుతుందని తెలిపింది. విద్య రంగంలో నాణ్యత, నైపుణ్యాలు పెరుగుతాయని పేర్కొంది. దేశ అభివృద్ధికి 3A2I ఫ్రేమ్‌వర్క్‌ను పీడబ్ల్యూసీ ప్రవేశపెట్టింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!