

ఓపెన్‌ఏఐ తన తొలి బ్రాండెడ్ హార్డ్‌వేర్ ఉత్పత్తిగా 'Codex Micro'ను అధికారికంగా ఆవిష్కరించింది. హార్డ్‌వేర్ డిజైన్ సంస్థ Work Louderతో కలిసి రూపొందించిన ఈ ప్రోగ్రామబుల్ మెకానికల్ మాక్రోప్యాడ్‌ను AI కోడింగ్ అసిస్టెంట్ Codex వినియోగదారుల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. మాజీ ఆపిల్ డిజైనర్ జోనీ ఐవ్‌తో కలిసి AI డివైస్‌ను తీసుకురానుందనే ప్రచారానికి భిన్నంగా, ఈసారి కోడింగ్, ఉత్పాదకతపై దృష్టి సారించిన హార్డ్‌వేర్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఈ పరిమిత ఎడిషన్ డివైస్ ధర 230 డాలర్లుగా నిర్ణయించారు.
Codex Microలో ఆరు ప్రత్యేక AI Agent Keys, జాయ్‌స్టిక్, రొటరీ డయల్, ప్రోగ్రామబుల్ మెకానికల్ కీలు ఉన్నాయి. AI ఏజెంట్ల పనితీరును రంగుల ద్వారా చూపించే స్మార్ట్ ఇండికేటర్లు, కోడ్ రివ్యూ, పుల్ రిక్వెస్ట్‌లు, కోడ్ మార్పులను అంగీకరించడం లేదా తిరస్కరించడం వంటి పనులను వేగంగా నిర్వహించే షార్ట్‌కట్‌లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. USB-C, బ్లూటూత్ కనెక్టివిటీ, సైలెంట్ లేదా క్లికీ స్విచ్‌ల ఎంపిక, అదనంగా 32 కీ క్యాప్స్‌తో ఈ డివైస్ AI ఆధారిత సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కు ప్రత్యేకంగా రూపొందించబడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!