

కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ఏఐ సంస్థల సీఈవోలు, అధికారులు భద్రతాపరమైన తీవ్రమైన బెదిరింపులు ఎదుర్కొంటున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగాలు కోల్పోతామనే భయం, ధరల మార్పులు, సమాజంపై ఏఐ ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనలు కొంతమందిలో తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తున్నాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ వంటి సంస్థలు తమ కీలక అధికారుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.
నివేదికల ప్రకారం, ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడికి యత్నించిన ఘటనతో పాటు, ఆంథ్రోపిక్ కార్యాలయంలో అనుమానాస్పద వ్యక్తి ప్రవేశించడం వంటి సంఘటనలు ఆందోళన కలిగించాయి. సంస్థ అధికారుల కుటుంబ సభ్యులకు హాని చేస్తామని హెచ్చరికలు, ఆయుధాలతో కార్యాలయానికి వస్తామంటూ బెదిరింపులు కూడా నమోదైనట్లు సమాచారం. ఇటీవల ఏఐ అధికారులు, డేటా సెంటర్లపై ఆన్‌లైన్ బెదిరింపులు గణనీయంగా పెరగడంతో టెక్నాలజీ సంస్థలు భద్రతా వ్యయాన్ని భారీగా పెంచుతున్నాయి. అమెరికాలో నిర్వహించిన సర్వేల్లో కూడా ఏఐపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!