
జనరల్

భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయికి రంగం సిద్ధమైంది. ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమకు కొత్త దిశను చూపించే తొలి ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్ విక్రమ్-1 ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారంతో ఈ ప్రయోగం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి నిర్వహించనున్నారు.
ఈ ప్రయోగం ద్వారా భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యానికి మరింత ఊతం లభించనుంది. తక్కువ వ్యయంతో, అధునాతన సాంకేతికతతో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే సామర్థ్యాన్ని ప్రదర్శించనున్న విక్రమ్-1, భారత స్పేస్ ఎకానమీ అభివృద్ధిలో కీలక అడుగుగా నిలవనుంది. ఈ ప్రయోగం దేశ ప్రైవేట్ స్పేస్ రంగ భవిష్యత్తుకు మార్గదర్శకంగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!