
గాసిప్స్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది.
ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 48 బంతుల్లో అజేయంగా 82 పరుగులు చేసి చివరి వరకు పోరాడినా జట్టుకు విజయం అందించలేకపోయింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ జెయింట్స్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో గుజరాత్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!