

మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ లీగ్ దశ ముగిసే సమయానికి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో పాటు పటిష్టంగా కనిపించిన యూపీ వారియర్స్ కూడా ప్లేఆఫ్స్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఆదివారం రాత్రి జరిగిన కీలక మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ యూపీ వారియర్స్‌పై విజయం సాధించడంతో ఈ రెండు జట్ల కథ ముగిసింది.
హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో నిలకడలేని ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలకే పరిమితమై పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. కీలక వేళల్లో బ్యాటింగ్ వైఫల్యం, బౌలర్ల రన్స్ లీకేజ్ జట్టుకు పెద్ద దెబ్బగా మారాయి. మరోవైపు యూపీ వారియర్స్ టోర్నీ ఆరంభంలో ఆశాజనకంగా కనిపించినప్పటికీ, ద్వితీయార్థంలో వరుస ఓటములతో వెనుకబడ్డింది. దిల్లీతో జరిగిన చావోరేవో మ్యాచ్‌లో 122 పరుగులకే పరిమితమై ఐదు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో ఐదో స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!