
గాసిప్స్

విజయ్ హజారే ట్రోఫీలో బిహార్ జట్టు లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బిహార్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 574 పరుగులు చేసి రికార్డు పుస్తకాలను తిరగరాసింది.
వైభవ్ సూర్యవంశీ 84 బంతుల్లో 190 పరుగులు చేసి (16 ఫోర్లు, 15 సిక్సర్లు) జట్టును అద్భుతంగా నడిపించాడు. షఖిబుల్ గని అజేయంగా 128 పరుగులు చేయగా, ఆయుష్ లోహారుక 116, పీయుష్ సింగ్ 77 పరుగులతో కీలక పాత్ర పోషించారు. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లలో మోహిత్, నెరి చెరో రెండు వికెట్లు తీయగా, ధీరజ్ ఒక వికెట్ పడగొట్టాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!