

బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్లు తొలి వన్డే మ్యాచ్‌లో తలపడ్డాయి. టాస్ గెలిచిన టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆసీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు భారత జట్టు 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయింది. భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మంధాన 68 బంతుల్లో 7 ఫోర్లతో 58 పరుగులు చేసి ఆకట్టుకోగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 84 బంతుల్లో 53 పరుగులు చేసి కీలక భాగస్వామ్యం అందించింది. కాశ్వీ గౌతమ్ 44 బంతుల్లో 43 పరుగులు చేసి అర్ధశతకాన్ని త్రుటిలో చేజార్చుకుంది.
మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. జట్టులోకి తిరిగి వచ్చిన ప్రతీకా రావల్ డకౌట్‌గా వెనుదిరిగింది. షెఫాలీ వర్మ (4), జెమీమా రోడ్రిగ్స్ (8), దీప్తి శర్మ (2), క్రాంతి గౌడ్ (2), శ్రీచరణి (2) నిరాశపరిచారు. రిచా ఘోష్ 23 పరుగులతో ఫర్వాలేదనిపించింది. ఆసీస్ బౌలర్లలో ఆష్లీ గార్డనర్ మూడు వికెట్లు తీసి మెరిసింది. మేగాన్ షుట్ రెండు వికెట్లు సాధించగా, డార్సీ బ్రౌన్, అలానా కింగ్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు.












.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!