

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. గరిడి గణపతి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వినాయకుడి విగ్రహంపై హెలికాప్టర్‌తో పూలవర్షం కురిపించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం బెంగళూరు నుంచి హెలికాప్టర్‌ను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి నుంచి పూలవర్షం కార్యక్రమం కొనసాగగా, దాన్ని వీక్షించేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు.
హిందూపురంలో ఏడు రోజులుగా వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రధాన వీధుల మీదుగా సాగిన ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వినాయకుడి నామస్మరణతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
శోభాయాత్ర సందర్భంగా భక్తులు కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారు. గరిడి గణపతి 50 ఏళ్ల వేడుకల సందర్భంగా నిర్వహించిన హెలికాప్టర్ పూలవర్షం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో హిందూపురం పట్టణం సందడిగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!