

ఇండోర్‌లో జరిగిన ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ జరిగిన మిమిక్రీపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ స్టాండ్‌అప్ కమెడియన్‌గా మారితే మంచి ఉపాధి లభిస్తుందని, కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే నిరుద్యోగంగా మార్చేశారని ఆయన ఎద్దేవా చేశారు. బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సారావోగి కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, చేష్టలు రాజకీయ అపరిపక్వతను ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ప్రధాని మాతృమూర్తిని అవమానించేలా ప్రవర్తించడం సమాజం అంగీకరించదని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. అది సాధారణ మిమిక్రీ మాత్రమేనని, అందులో అభ్యంతరకరమైనదేమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో కలిసి స్టాండ్‌అప్ కమెడియన్ పుల్కిత్ మణి మోదీని అనుకరించిన ఘటనపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, కాంగ్రెస్ వర్గాలు మాత్రం దాన్ని రాజకీయ వ్యంగ్యంగా సమర్థించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!