

ఐపీఎల్‌లో కంటెంట్ క్రియేషన్ కల్చర్ శ్రుతిమించుతోందని ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల చుట్టూ నిరంతరం కెమెరాల నిఘా ఉండటంతో స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోతున్నామని ఆయన అన్నారు. ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్లు కంటెంట్ కోసం చేస్తున్న ఒత్తిడి ఆటగాళ్లకు అసౌకర్యాన్ని కలిగిస్తోందని విమర్శించారు.
మయాంతి లాంగర్ హోస్ట్ చేసిన ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కోహ్లీ, ప్రాక్టీస్ సమయంలో కూడా కెమెరాలు తమను ఫాలో అవుతున్నాయని చెప్పారు. కేన్ విలియమ్సన్‌తో మాట్లాడుతున్న సమయంలో కూడా చిత్రీకరణ చేయడం అసౌకర్యంగా అనిపించిందని వివరించారు. ఆటగాళ్ల వ్యక్తిగత స్థలాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
డిజిటల్ యుగంలో కంటెంట్ అవసరాన్ని అర్థం చేసుకుంటున్నప్పటికీ, దానికి పరిమితులు ఉండాలని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ప్రతి కదలికను రికార్డ్ చేసి విశ్లేషించడం వల్ల సహజమైన వాతావరణం దెబ్బతింటుందని పేర్కొన్నాడు. ఆటగాళ్లకు ప్రశాంతమైన వాతావరణంలో ప్రాక్టీస్ చేసే స్వేచ్ఛ ఉండాలని స్పష్టం చేశాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!