

స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ ఐ ) మధ్య వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఇక్కడ జరుగుతున్న జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ రెజ్లింగ్ టోర్నీలో పాల్గొనేందుకు వినేశ్ తన భర్తతో కలిసి సోమవారం ఇక్కడకు చేరుకుంది. అయితే, ఆమెకు అనుమతి దక్కలేదు. పోటీల వెరిఫికేషన్‌కు తన డాక్యుమెంట్లను పరిశీలించాలని వినేశ్ కోరినా, అధికారులు నిరాకరించారు.
పారిస్ ఒలింపిక్స్ అనంతరం రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన 31 ఏళ్ల వినేశ్..తర్వాత నిర్ణయం మార్చుకొని ఆటలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ నిబంధనల ప్రకారం పునరాగమనం చేసే రెజ్లర్ ఆరు నెలల నోటీస్ వ్యవధి పాటించాలనీ, కానీ వినేశ్ దీన్ని అతిక్రమించిందన్నది డబ్ల్యూఎ్‌ఫఐ వాదన. ఆమేరకు వినేశ్ వచ్చే జూన్ 26 వరకు పోటీలలో పాల్గొనకుండా నిషేధం విధిస్తూ ఆమెకు నోటీస్ ఇచ్చింది. తనకు అనుమతి నిరాకరించడంపై వినేశ్ మాట్లాడుతూ.. రెజ్లింగ్‌లో తన పునరాగమనాన్ని అడ్డుకొనేందుకు ప్రణాళికాబద్ధమైన కుట్ర జరుగుతోందని ఆరోపించింది. ‘నేను మళ్లీ ఆటలోకి రావడం వారికి ఇష్టంలేదు. అందుకే నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫలితంగా నేను అలసిపోయి నా అంతట నేనే వైదొలగుతాననేది వారి వ్యూహం’ అని వినేశ్ ధ్వజమెత్తింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!