

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదల తేదీపై అనిశ్చితి నెలకొన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మార్చి, ఆగస్ట్ 21 వంటి పలు తేదీలు పరిశీలించిన తర్వాత ప్రస్తుతం సెప్టెంబర్ 25 విడుదలపై మేకర్స్ దృష్టి పెట్టినట్లు సమాచారం. అయితే సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో ఆ తేదీకి కూడా విడుదల కష్టమేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, గతంలో ‘ది ప్యారడైజ్’ కోసం ప్రచారంలో ఉన్న ఆగస్ట్ తేదీని రవితేజ ‘ఇరుముడి’ చిత్రం దక్కించుకున్నట్లు సమాచారం.
సినిమా పూర్తి కావడానికి ఇంకా దాదాపు రెండు నెలల షూటింగ్ మిగిలి ఉందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అక్టోబర్‌లో షూటింగ్ పూర్తయినా, అదే సమయంలో విడుదల కానున్న పాన్ ఇండియా చిత్రం ‘రామాయణ’తో పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో డిసెంబర్ విడుదలను కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ప్రభాస్ ‘ఫౌజీ’, షారుఖ్ ఖాన్ ‘కింగ్’ వంటి భారీ చిత్రాలు కూడా విడుదలయ్యే అవకాశముండటంతో, తుది విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!