

అండర్-19 వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత జట్టు తన తొలి మ్యాచ్‌లోనే ఘన విజయం సాధించింది. గురువారం క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన గ్రూప్-A మ్యాచ్‌లో అమెరికాపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్, తొలి ఓవర్ నుంచే అమెరికాపై ఒత్తిడి పెంచింది. హేనిల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ కేవలం 16 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి యూఎస్ఏను 35.2 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌట్ చేశాడు. అమెరికా బ్యాటర్లలో నితీష్ సుదిని (36) మాత్రమే కాస్త పోరాడాడు.
లక్ష్య ఛేదనలో భారత్ బ్యాటింగ్ చేస్తుండగా వర్షం అంతరాయం కలగడంతో మ్యాచ్‌ను 37 ఓవర్లకు కుదించి, డీఎల్ఎస్ పద్ధతిలో 96 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. తక్కువ లక్ష్యమే అయినప్పటికీ భారత్ 70/4 వద్ద కష్టాల్లో పడింది. ఈ సమయంలో వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు బాధ్యతాయుతంగా ఆడి 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. చివరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదే మ్యాచ్‌లో 14 ఏళ్ల 294 రోజుల వయసులో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ అండర్-19 వరల్డ్ కప్‌లో ఆడిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!