

టీమిండియా స్వదేశీ మ్యాచ్‌లకు కొత్త టైటిల్ స్పాన్సర్‌ను ఖరారు చేయడంలో బీసీసీఐ ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. బిడ్ల దాఖలుకు ఆగస్టు 13తో గడువు ముగిసినా.. ఇప్పటివరకు కొత్త స్పాన్సర్‌పై అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం పలువురు సంస్థలతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గూగుల్ జెమినీ, స్పిన్నీ, ఎస్‌బీఐ లైఫ్ వంటి సంస్థల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జులై 20న టైటిల్ స్పాన్సర్ కోసం బీసీసీఐ టెండర్ ఆహ్వానించింది. ఆగస్టు 4 వరకు టెండర్ పత్రాల కొనుగోలుకు, ఆగస్టు 5 వరకు సందేహాల నివృత్తికి అవకాశం కల్పించింది. అనంతరం ఆగస్టు 13న బిడ్ల దాఖలు గడువు ముగిసింది.
ప్రస్తుతం టీమిండియా స్వదేశీ మ్యాచ్‌ల టైటిల్ హక్కులు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వద్ద ఉన్నాయి. ఒక్కో మ్యాచ్‌కు ఆ సంస్థ బీసీసీఐకి రూ.4.2 కోట్లు చెల్లిస్తోంది. అయితే తాజా బిడ్డింగ్‌లో కనీస ధరను రూ.4.75 కోట్లుగా బీసీసీఐ నిర్ణయించింది. కొత్త ఒప్పందం 2028 మార్చి 31 వరకు కొనసాగనుంది. సుమారు 35 మ్యాచ్‌లకు టైటిల్ స్పాన్సర్ హక్కులు లభించనున్న ఈ ఒప్పందంలో 10 టెస్టులు, 12 వన్డేలు, 13 టీ20లు ఉన్నాయి. బిడ్డర్‌కు గత మూడు ఆడిట్ చేసిన ఆర్థిక సంవత్సరాల్లో సగటు టర్నోవర్ లేదా సగటు నికర విలువ కనీసం రూ.100 కోట్లు ఉండాలనే నిబంధనను కూడా బీసీసీఐ విధించింది. పెరిగిన బేస్ ప్రైస్, కఠినమైన ఆర్థిక అర్హతల నేపథ్యంలో కొత్త స్పాన్సర్ ఎంపిక ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. మరి టీమిండియా స్వదేశీ మ్యాచ్‌లకు కొత్త టైటిల్ స్పాన్సర్‌గా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!