

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మరణం మరోసారి వార్తల్లోకి వచ్చింది. 2020 జూన్ 8న ముంబైలోని ఓ హై-రైజ్ భవనం 14వ అంతస్తు నుంచి పడిపోవడంతో దిశా మృతి చెందారు. ఆమె మరణంపై తాజా దర్యాప్తు జరిపించాలని కోరుతూ తండ్రి సతీష్ సాలియన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ సందర్భంగా వైద్య ఆధారాలు, దర్యాప్తు విధానం, చట్టపరమైన ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది. దర్యాప్తులో సరైన విధానాన్ని అనుసరించి కేసుకు చట్టబద్ధమైన ముగింపు ఇవ్వాల్సిన అవసరాన్ని కోర్టు ప్రస్తావించింది.
మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జరిగిన దర్యాప్తును సమర్థించింది. సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు, ఫోరెన్సిక్ ఆధారాలు తదితరాలను పరిశీలించినప్పటికీ ఫౌల్ ప్లేకు ఆధారాలు లభించలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు దిశా తండ్రి పిటిషన్‌లో ఆమె మరణంపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే పిటిషన్‌లో చేసిన ఆరోపణలు ఇంకా న్యాయపరంగా నిర్ధారణ కాలేదు. అన్ని వాదనలు విన్న బాంబే హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!