
జనరల్

‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ‘అర్జున్ రెడ్డి’ వస్తున్నాడు! రేపు రామానాయుడు స్టూడియోస్‌లో సాయంత్రం 6 గంటల నుంచి జరగనున్న గ్రాండ్ ప్రీ-రిలీజ్ వేడుకకు ‘అర్జున్ రెడ్డి’ రాబోతున్నాడంటూ మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రకటనతో సినిమా కంటే ఈవెంట్‌పై కూడా ఆసక్తి మరింత పెరిగింది. ‘అర్జున్ రెడ్డి’ రాక వెనుక ఉన్న ప్రత్యేకత ఏమిటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కుతున్న ‘రోమాంచకం’ చిత్రానికి వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ‘అర్జున్ రెడ్డి’ వస్తున్నాడనే ప్రకటనతో సినిమాకు, రేపటి వేడుకకు మరింత హైప్ వచ్చింది. ఈ కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!