

ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత జట్టు సమష్టిగా రాణించి ఘన విజయం సాధించింది. బౌలర్లు అద్భుతంగా దక్షిణాఫ్రికాను కట్టడి చేయగా, బ్యాటర్లు లక్ష్యాన్ని ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఛేదించారు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా చేరుకుంది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 118 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం లభించింది. అభిషేక్ శర్మ (35), శుభ్మన్ గిల్ (28) తొలి వికెట్కు 60 పరుగులు జోడించారు. వీరు అవుటైన తర్వాత తిలక్ వర్మ (26 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12) తన వైఫల్యాన్ని కొనసాగించాడు. చివరకు టీమిండియా 15.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకోగా, దక్షిణాఫ్రికా బ్యాటింగ్కు దిగింది. హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్ ధాటికి దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది. కేవలం 7 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా తీవ్ర ఒత్తిడిలో పడింది. ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమవగా, ఐదెన్ మార్క్రమ్ (61) ఒంటరి పోరాటం చేశాడు. డోనావన్ (20), నోర్ట్జే (12) మాత్రమే రెండంకెల స్కోర్లు నమోదు చేశారు.
భారత బౌలింగ్లో హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్యా మరియు శివమ్ దూబె ఒక్కో వికెట్ సాధించారు. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఏడు వికెట్ల తేడాతో మ్యాచ్ను కైవసం చేసుకున్నారు.

_1771477764226.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!