
గాసిప్స్

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా జరిగిన మ్యాచ్లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. దీంతో నెదర్లాండ్స్ జట్టుకు 194 పరుగుల లక్ష్యం నిర్ధేశించింది.
భారత్ తరఫున శివమ్ దూబే 66 (31) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, సూర్యకుమార్ యాదవ్ 34 (28) పరుగులతో కీలకంగా సహకరించాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్ 3/56 గణాంకాలతో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు నెదర్లాండ్స్ జట్టు బ్యాటర్లు ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ ఫలితం గ్రూప్ పాయింట్ల పట్టికలో కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!