
టెక్నాలజీ

భారత్–శ్రీలంక సంయుక్త ఆతిథ్యంతో జరగనున్న ICC మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8, 2026 వరకు కొనసాగనుంది. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి అగ్ర జట్లు గ్రూప్ దశలోనే పరస్పరం తలపడనున్నాయి.
కోల్కతా, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీతో పాటు శ్రీలంకలోని కొలంబో, కాండీ, ప్రేమదాస స్టేడియంలు మ్యాచ్లకు వేదికలు కానున్నాయి. గ్రూప్ దశ తర్వాత ఫిబ్రవరి చివర్లో సూపర్ దశ మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 4, 5 తేదీల్లో సెమీఫైనల్స్ నిర్వహించనుండగా, మార్చి 8న ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లేదా కొలంబోలో జరగనుంది. ఇప్పటికే షెడ్యూల్ వెలువడటంతో క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!