
బిజినెస్

టీ20 ప్రపంచకప్ సూపర్-8 మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 63 పరుగులతో అర్ధ సెంచరీ సాధించి జట్టుకు బలమైన స్కోరు అందించగా, డేవాల్డ్ బ్రెవిస్ 45 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 44 నాటౌట్‌గా దూకుడుగా ఆడారు. అయితే ఐడెన్ మార్క్రమ్ (4), క్వింటన్ డికాక్ (6), రియాన్ రికెల్టన్ (7) నిరాశపరిచారు.

భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీసి ఆకట్టుకోగా, అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు సాధించాడు. శివమ్ దూబె, వరుణ్ చెరో వికెట్ తీశారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో హార్దిక్ పాండ్య 20 పరుగులు ఇవ్వడంతో దక్షిణాఫ్రికా స్కోరు వేగంగా పెరిగి భారత్ ముందు 188 పరుగుల సవాల్‌ను ఉంచింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!