

ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన అగ్రస్థానాన్ని మరోసారి దక్కించుకుంది. ఇటీవల భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించి, టీ20 సిరీస్‌ను గెలిచినప్పటికీ వన్డే, టెస్ట్ సిరీస్‌లో విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ర్యాంకింగ్స్‌లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
స్మృతి మంధాన 790 పాయింట్లతో టాప్ స్థానంలో కొనసాగుతున్నప్పటి, సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ 782 పాయింట్లతో రెండవ స్థానంలో, బెత్ మూనీ 749 పాయింట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 652 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో యథాతథంగా నిలిచింది. మరో స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఒక స్థానం కిందకి చేరి 635 పాయింట్లతో 12వ స్థానానికి పరిమితమైంది.
బౌలింగ్ విభాగంలో ఆసీస్ ప్లేయర్ అలానా కింగ్ 775 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ ర్యాంకింగ్స్ భారత మహిళల క్రికెట్లోని ఆటగాళ్ల ప్రస్తుత స్థితిని స్పష్టంగా చూపుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!