

న్యూజిలాండ్తో జరగనున్న మూడు వన్డే సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్లో దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి మాత్రం స్థానం దక్కలేదు. సెలక్టర్ల నిర్ణయంపై షమీ వ్యక్తిగత కోచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
షమీ కోచ్ మాట్లాడుతూ, "ఒక ఆటగాడు ఇంతకంటే ఏం చేయగలడు? షమీ ఇంకెన్ని వికెట్లు తీస్తే జట్టులోకి తీసుకుంటారు? వన్డే జట్టులో అతని అవసరం లేదని సెలక్టర్లు భావిస్తున్నారని. కానీ దేశానికి అందించడానికి అతని వద్ద ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది" అని అన్నాడు.
బెంగాల్ కోచ్ లక్ష్మీరతన్ శుక్లా కూడా సెలక్షన్ కమిటీపై మండిపడ్డాడు. "షమీకి సెలక్షన్ కమిటీ అన్యాయం చేసింది. ఇటీవలి కాలంలో దేశవాళీ క్రికెట్లో ఇంత అంకితభావంతో ఆడిన అంతర్జాతీయ క్రికెటర్ ఎవరూ లేరు. షమీ పట్ల ఇలా ప్రవర్తించడం అవమానకరం" అని ఆయన తెలిపాడు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!