20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీ20 క్రికెట్‌లో జోస్ బట్లర్ ప్ర‌పంచ రికార్డ్‌

Writer: Sreekanth Reddy 11:23 AM, 6 ఆగస్టు, 2026
టీ20 క్రికెట్‌లో జోస్  బట్లర్ ప్ర‌పంచ రికార్డ్‌

ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్, కెప్టెన్ జోస్ బట్లర్ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్‌ను అధిగమించి టీ20 పరుగుల రారాజుగా అవతరించాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ లీగ్‌లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న బట్లర్, వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ చారిత్రక మైలురాయిని అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో బట్లర్ కేవలం 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 51 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతను టీ20ల్లో మొత్తం 14,833 పరుగుల మార్కును చేరుకున్నాడు. ఇప్పటివరకు 746 మ్యాచ్‌ల్లో 14,803 పరుగులతో పొలార్డ్ అగ్రస్థానంలో ఉండగా, బట్లర్ కేవలం 522 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును బద్దలుకొట్టడం విశేషం. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (463 మ్యాచ్‌ల్లో 14,562 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. బట్లర్ తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 9 సెంచరీలు, 105 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

ఈ ఘనత సాధించిన అనంతరం బట్లర్ స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. "టీ20ల్లో అందరికంటే ఎక్కువ పరుగులు చేయడం గొప్ప అనుభూతినిస్తోంది. ఇది గర్వకారణమైన క్షణం. భవిష్యత్తులో ఎవరో ఒకరు ఈ రికార్డును అధిగమిస్తారు. అతడు బహుశా సూర్యవంశీ కావచ్చు" అని సరదాగా వ్యాఖ్యానించాడు. "క్రికెట్ ఎంత వేగంగా మారిపోతుందో చెప్పలేం. కొన్ని నెలల క్రితం ఫామ్ కోసం చాలా ఇబ్బంది పడ్డాను. కానీ, గత కొన్ని వారాలుగా నా కెరీర్‌లోనే అత్యుత్తమంగా బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఫామ్‌ను తిరిగి పొందడానికి ఎంతో కష్టపడ్డాను. పట్టుదలతో మళ్లీ ఇక్కడికి వచ్చాను" అని బట్లర్ చెప్పుకొచ్చాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం

ఆసియా క్రీడల్లో వరుణ్ సన్యాల్‌కు ఊహించని షాక్

ఆసియా క్రీడల్లో వరుణ్ సన్యాల్‌కు ఊహించని షాక్

మహిళల ఆసియా గేమ్స్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

మహిళల ఆసియా గేమ్స్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

స్మృతి మంధాన ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..

స్మృతి మంధాన ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..

సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌

సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...

ట్యాగ్లు
జొస్ బట్లర్టీ20 క్రికెట్వరల్డ్ రికార్డ్అత్యధిక రన్స్ఐసీసీఈసీబీలార్డ్స్క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు
జనరల్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు
జనరల్

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు

తెలంగాణలో దసరా సెలవుల ప్రకటన
జనరల్

తెలంగాణలో దసరా సెలవుల ప్రకటన

ఎఫ్‌డీఏ చీఫ్ తుకారాం ముంఢేపై మల్లికా శెరావత్ ప్రశంసలు
జనరల్

ఎఫ్‌డీఏ చీఫ్ తుకారాం ముంఢేపై మల్లికా శెరావత్ ప్రశంసలు

‘మైసా’ టీజర్‌లో రష్మిక రఫ్ అండ్ పవర్‌ఫుల్ లుక్
సినిమాలు

‘మైసా’ టీజర్‌లో రష్మిక రఫ్ అండ్ పవర్‌ఫుల్ లుక్

నైజాంలో ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్
జనరల్

నైజాంలో ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్
గాసిప్స్

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం
క్రీడలు

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం
జనరల్

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
జనరల్

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం
జనరల్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన
జనరల్

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!