

బిగ్ బాస్ తెలుగు 10 రెండో వారం నామినేషన్స్ ప్రక్రియను గమనిస్తే.. ఈ వారం త్రిగుణ్‌పై ఎక్కువ మంది కంటెస్టెంట్లు గురిపెట్టినట్లు కనిపించింది. నామినేషన్స్ సమయంలో సుధీర్, దేబ్జానీ, రోహిత్‌లు త్రిగుణ్‌తో నేరుగా వాదనకు దిగారు. అతడి గేమ్, ప్రవర్తనపై పలు ప్రశ్నలు, ఆరోపణలు చేశారు. అయితే త్రిగుణ్ మాత్రం ప్రతి ఆరోపణకు తనదైన శైలిలో సమాధానం ఇస్తూ.. తన వాదనను వినిపించాడు. దీంతో నామినేషన్స్ ప్రక్రియలో త్రిగుణ్ చుట్టూనే ఎక్కువ చర్చ జరిగినట్లు కనిపించింది.
మరోవైపు త్రిగుణ్‌తో రోహిత్‌కు వరుసగా జరుగుతున్న వాగ్వాదాలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. వీరిద్దరి మధ్య కొనసాగుతున్న వివాదాలు రోహిత్ గేమ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం నామినేషన్స్‌లో ఉన్న 11 మంది కంటెస్టెంట్లలో ప్రేక్షకులు ఎవరికి మద్దతు ఇస్తారన్నదే కీలకం. ఈ వారం ఎవరి గేమ్ మరింత బలపడుతుంది? ఎవరి గ్రాఫ్ పెరుగుతుంది? ఎవరి ఆటపై నామినేషన్స్ ప్రభావం చూపుతుందన్నది రాబోయే ఎపిసోడ్లలో తేలనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!