

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహ వేడుకకు సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మే నెలలో జరిగిన ఈ వివాహ వేడుక ఖర్చులను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పేర్కొంటున్న ఓ రష్యన్ ఒలిగార్క్ భరించినట్లు జూనియర్ ట్రంప్ భార్య బెట్టినా ట్రంప్ వెల్లడించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో చేసిన ఓ పోస్ట్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ అధిపతి ఒలిగార్క్ క్రెమ్లెవ్ తమ వివాహానికి ఆర్థికంగా సహకరించిన వ్యక్తి అని బెట్టినా ట్రంప్ పేర్కొన్నారు. తమ వివాహ వేడుకకు సంబంధించిన లక్షల డాలర్ల ఖర్చులను ఆయన భరించినట్లు తెలిపారు. ట్రంప్ కుటుంబంతో సంబంధం ఉన్న ఈ వివాహ వేడుకకు రష్యన్ కుబేరుడి నుంచి ఆర్థిక సహాయం అందిందన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!