

నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో తాజాగా యశ్ పోషిస్తున్న రావణుడి పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన సమాచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘రామాయణ’ పార్ట్-1లో యశ్ పాత్రకు గంటకు పైగా స్క్రీన్ టైమ్ ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రావణుడి పాత్రకు కథలో కీలక ప్రాధాన్యం ఉండటంతో, యశ్ కనిపించే సన్నివేశాలను భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం యశ్ సుమారు 55 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. రావణుడి ఆగ్రహం, వ్యక్తిత్వం, శక్తిని తెరపై ప్రభావవంతంగా చూపించేందుకు మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు టాక్. కాజల్ అగర్వాల్ మండోదరిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, శోభన కైకసిగా కనిపించనున్నారు. ‘రామాయణ’ పార్ట్-1 నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!