

టీమిండియా బ్యాటర్, మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. గోవాలో జరిగిన మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రుతురాజ్ 131 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 134 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌తో మహారాష్ట్ర 50 ఓవర్లలో 7 వికెట్లకు 249 పరుగులు సాధించింది.
ఈ సెంచరీతో విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు (15) చేసిన బ్యాటర్‌గా అంకిత్ బావ్నే రికార్డును రుతురాజ్ సమం చేశాడు. విశేషమేమిటంటే, ఈ ఘనతను రుతురాజ్ కేవలం 59 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకోగా, అంకిత్ బావ్నే వందకు పైగా మ్యాచ్‌లు ఆడి ఈ మార్క్ చేరాడు. ఇది ఈ సీజన్లో రుతురాజ్‌కు రెండో సెంచరీ.
ఈ జాబితాలో రుతురాజ్, బావ్నేల తర్వాత కర్ణాటక బ్యాటర్లు దేవదత్ పడిక్కల్, మయాంక్ అగర్వాల్ (13 సెంచరీలు) ఉన్నారు. ప్రస్తుత సీజన్లోనే పడిక్కల్ నాలుగు సెంచరీలు చేయడం గమనార్హం. ఆశ్చర్యకరంగా, విరాట్ కోహ్లీ, సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని వంటి భారత దిగ్గజాలు కూడా ఈ రికార్డు దరిదాపుల్లోకి రాలేదు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!