4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కివీస్‌తో వన్డే పోరుకు టీమ్‌ఇండియా రెడీ.. రో-కో జోడీపై భారీ అంచనాలు

Writer: Chandrika 06:57 AM, 4 నవంబర్, 2026
కివీస్‌తో వన్డే పోరుకు టీమ్‌ఇండియా రెడీ.. రో-కో జోడీపై భారీ అంచనాలు

2027లో దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఫాస్ట్‌ పిచ్‌లకు పేరుగాంచిన దక్షిణాఫ్రికా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే.. న్యూజిలాండ్‌ పర్యటన భారత ఆటగాళ్లకు మంచి సన్నాహకంగా మారనుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌.. ఇప్పుడు వన్డేల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌తో పాటు సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ మధ్య ఓవర్లలో జట్టుకు అండగా నిలవాల్సి ఉంటుంది. ఆల్‌రౌండర్లు నితీశ్‌కుమార్‌ రెడ్డి, నమన్‌ ధీర్‌, అక్షర్‌ పటేల్‌ జట్టు సమతూకాన్ని పెంచనున్నారు. అయితే బౌలింగ్‌ విభాగం భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. మహ్మద్‌ సిరాజ్‌ నేతృత్వంలో అర్ష్‌దీప్‌ సింగ్‌, గుర్నూర్‌ బ్రార్‌ పేస్‌ బాధ్యతలు చేపట్టనుండగా.. మధ్య ఓవర్లలో అక్షర్‌ పటేల్‌, నమన్‌ ధీర్‌ కీలకం కానున్నారు.

మరోవైపు న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్ఠంగా కనిపిస్తోంది. టీ20 సిరీస్‌లో రాణించిన టిమ్‌ సీఫర్ట్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, డారిల్‌ మిచెల్‌, మైకేల్‌ బ్రాస్‌వెల్‌తో పాటు విల్‌ యంగ్‌, టామ్‌ లేథమ్‌ బ్యాటింగ్‌ బలాన్ని పెంచనున్నారు. స్పిన్‌లో మిచెల్‌ శాంట్నర్‌, పేస్‌లో మ్యాట్‌ హెన్రీ, కైల్‌ జేమీసన్‌, జాకబ్‌ డఫీ, నాథన్‌ స్మిత్‌ భారత్‌కు సవాలు విసరనున్నారు. హెన్రీ ఫిట్‌నెస్‌ సాధించకపోతే అతడి స్థానంలో బ్లెయిర్‌ టిక్నర్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆక్లాండ్‌ పిచ్‌ బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా సహకరించే అవకాశముందని, పేసర్లకు మంచి ప్రాధాన్యం ఉంటుందని అంచనా. వర్షం ముప్పు లేదని సమాచారం. ఇదిలా ఉండగా, సాధన సమయంలో క్యాచ్‌ పట్టే ప్రయత్నంలో పేసర్‌ మ్యాట్‌ హెన్రీని ఢీకొన్న న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వేకు కంకషన్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతడు తొలి వన్డేకు దూరమయ్యాడు. అతడి స్థానంలో టిమ్‌ సీఫర్ట్‌ను జట్టులోకి తీసుకున్నారు.

అంచనా తుది జట్లు

భారత్‌: శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, నితీశ్‌కుమార్‌ రెడ్డి, నమన్‌ ధీర్‌, అక్షర్‌ పటేల్‌, గుర్నూర్‌ బ్రార్‌, మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

న్యూజిలాండ్‌: విల్‌ యంగ్‌, టిమ్‌ సీఫర్ట్‌, డారిల్‌ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, టామ్‌ లేథమ్‌, మైకేల్‌ బ్రాస్‌వెల్‌, మిచెల్‌ శాంట్నర్‌, నాథన్‌ స్మిత్‌, కైల్‌ జేమీసన్‌, జాకబ్‌ డఫీ, మ్యాట్‌ హెన్రీ/బ్లెయిర్‌ టిక్నర్‌.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సొంత ఖర్చుతోనే సింధు, లక్ష్యసేన్‌ విజయాలు

సొంత ఖర్చుతోనే సింధు, లక్ష్యసేన్‌ విజయాలు

బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు నిధుల కష్టాలు..సింధు కీలక వ్యాఖ్యలు

బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు నిధుల కష్టాలు..సింధు కీలక వ్యాఖ్యలు

ప్రపంచకప్ ఫైనల్ టికెట్ల కోసం భారీ పోటీ

ప్రపంచకప్ ఫైనల్ టికెట్ల కోసం భారీ పోటీ

న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో టీమ్‌ఇండియా రికార్డులివే!

న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో టీమ్‌ఇండియా రికార్డులివే!

హార్దిక్‌ పాండ్య రీఎంట్రీపై గిల్‌ కీలక అప్‌డేట్‌..

హార్దిక్‌ పాండ్య రీఎంట్రీపై గిల్‌ కీలక అప్‌డేట్‌..

ఐపీఎల్ 2027కు ముందు బిగ్ ట్రేడ్.. పంజాబ్‌కు హార్దిక్, ముంబైకి అర్ష్‌దీప్?

ఐపీఎల్ 2027కు ముందు బిగ్ ట్రేడ్.. పంజాబ్‌కు హార్దిక్, ముంబైకి అర్ష్‌దీప్?

ట్యాగ్లు
భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌భారత్‌ వన్డే సిరీస్‌న్యూజిలాండ్‌ క్రికెట్‌శుభ్‌మన్‌ గిల్‌రోహిత్‌ శర్మవిరాట్‌ కో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
జనరల్

హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు

వాహనదారులకు భారీ ఊరట
బిజినెస్

వాహనదారులకు భారీ ఊరట

అక్కడ సూర్య ‘సీన్’కు అదిరిపోయే బుకింగ్స్.. కానీ ఇక్కడ ?
సినిమాలు

అక్కడ సూర్య ‘సీన్’కు అదిరిపోయే బుకింగ్స్.. కానీ ఇక్కడ ?

కొత్త 'రామాయణ'పై పాత లక్ష్మణుడి ప్రశంసలు
సినిమాలు

కొత్త 'రామాయణ'పై పాత లక్ష్మణుడి ప్రశంసలు

‘కింగ్ 100’లో నాగార్జున వర్సెస్ టబు.. పవర్‌ఫుల్ పాత్రలో సీనియర్ హీరోయిన్!
సినిమాలు

‘కింగ్ 100’లో నాగార్జున వర్సెస్ టబు.. పవర్‌ఫుల్ పాత్రలో సీనియర్ హీరోయిన్!

చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలు తప్పక పాటించాలి.. వైద్యుల సూచన!
ఆరోగ్యం

చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలు తప్పక పాటించాలి.. వైద్యుల సూచన!

ఇంత పోటీలో ‘సమ్మర్ హాలిడేస్’ నిలబడుతుందా?
సినిమాలు

ఇంత పోటీలో ‘సమ్మర్ హాలిడేస్’ నిలబడుతుందా?

మణుగూరు కండక్టర్ ప్రవళిక మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి
జనరల్

మణుగూరు కండక్టర్ ప్రవళిక మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి

ఓటీటీలోకి రజినీకాంత్ ‘జైలర్ 2’.. ?
ఓటీటీ

ఓటీటీలోకి రజినీకాంత్ ‘జైలర్ 2’.. ?

సొంత ఖర్చుతోనే సింధు, లక్ష్యసేన్‌ విజయాలు
క్రీడలు

సొంత ఖర్చుతోనే సింధు, లక్ష్యసేన్‌ విజయాలు

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. సత్తా చాటుతున్న భారత సంతతి అభ్యర్థులు
రాజకీయాలు

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. సత్తా చాటుతున్న భారత సంతతి అభ్యర్థులు

భారత్‌లో ఇళ్ల కొనుగోలుకు ఎన్‌ఆర్‌ఐల ఆసక్తి
జనరల్

భారత్‌లో ఇళ్ల కొనుగోలుకు ఎన్‌ఆర్‌ఐల ఆసక్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!