
న్యూస్

టీమ్ ఇండియా యువ క్రికెటర్ రింకు సింగ్ టీ20 ప్రపంచ కప్‌కు సిద్ధమవుతున్న సమయంలో అతడికి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. రింకు సింగ్‌కు చెందిన ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. హ్యాకర్లు ఫేస్బుక్ మోనిటైజేషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తమ ఖాతాలకు మళ్లించినట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై రింకు సింగ్ సోదరుడు సోనమ్ సింగ్ అలీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ హ్యాకింగ్ వల్ల ఎంత మేరకు ఆర్థిక నష్టం వాటిల్లిందనే అంశంపై ప్రస్తుతం స్పష్టత లేదని, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!