
క్రీడలు

టీమిండియా స్టార్ బ్యాటర్, ఫినిషర్ రింకు సింగ్ మంగళవారం అకస్మాత్తుగా జట్టును వీడిన విషయం తెలిసిందే. కుటుంబ అత్యవసర పరిస్థితుల కారణంగా ఆయన స్వగ్రామానికి వెళ్లినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రింకు తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో గురువారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో భారత్ – జింబాబ్వే క్రికెట్ జట్టు మధ్య జరగనున్న కీలక మ్యాచ్‌లో రింకు ఆడతాడా లేదా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. దీనిపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ శితాంశు కోటక్ స్పష్టత ఇచ్చారు.
సూపర్ 8 దశలో జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌కు రింకు సింగ్ అందుబాటులో ఉంటాడని కోటక్ తెలిపారు. కుటుంబ పరిస్థితి కారణంగా జట్టును విడిచిన రింకు, బుధవారం సాయంత్రానికి మళ్లీ భారత జట్టుతో చేరతాడని ఆయన వెల్లడించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!