
న్యూస్

కొలంబో: ఈ నెల (ఫిబ్రవరి) 15 న జరగాల్సిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్కు వాన ముప్పు ఉన్నట్లు శ్రీలంక వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రత్యేక వాతావరణ బులిటెన్ లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిస్థితుల వల్ల భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మ్యాచ్ రోజున నల్లని మేఘాలు కమ్ముకునే అవకాశం ఉందని, వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!