
రాజకీయాలు

పంజాబ్‌లోని జలంధర్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, పంజాబ్‌ను నేరస్థులు నడుపుతున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లపై కూడా బాంబు దాడులు జరుగుతున్న పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి స్థిరమైన, సమర్థవంతమైన పాలన అవసరమని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రం-రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉండే డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు అభివృద్ధి, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వాలను ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!