

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో తనకున్న సన్నిహిత అనుబంధం గురించి మరోసారి వెల్లడించారు. ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సింధు.. కోహ్లీ తనకు సోదరుడిలాంటి వ్యక్తి అని పేర్కొన్నారు. కెరీర్‌లో తాను క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో కోహ్లీని కలిశానని, ఆ సందర్భంగా ఆయన ఎంతో ఓదార్పుగా మాట్లాడారని గుర్తుచేసుకున్నారు. తన ఆటపై దృష్టి పెట్టాలని, తన సామర్థ్యాలను నమ్మాలని కోహ్లీ ఇచ్చిన సలహా తనలో ఎంతో స్ఫూర్తిని నింపిందని చెప్పారు.
ఆ సంభాషణ తర్వాత తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని సింధు తెలిపారు. తాను సాధించిన విజయాలను కోహ్లీతో పంచుకునేదానినని, ఎప్పుడు కలిసినా ఎంతో సంతోషంగా అనిపించేదని చెప్పారు. జీవితంలో ఎంతో సాధించిన వ్యక్తి నుంచి వచ్చే సూచనలు ఎంతో విలువైనవని సింధు పేర్కొన్నారు. ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన ఆమె.. తొలి రౌండ్‌లోనే అద్భుత విజయాన్ని నమోదు చేసి ముందుకు సాగుతున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!