

Annals of Allergy, Asthma & Immunologyలో ప్రచురితమైన కొత్త అధ్యయనం SARS-CoV-2 ఇన్ఫెక్షన్‌కు, ఆరు రకాల అలర్జీ సమస్యల ముప్పు పెరగడానికి మధ్య సంబంధం ఉండొచ్చని సూచించింది. 1 నుంచి 64 ఏళ్ల వయసున్న వ్యక్తులను పరిశీలించిన పరిశోధకులు.. కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత 18 నెలల కాలంలో ఆరోగ్య పరిస్థితులను విశ్లేషించారు. అటోపిక్ డెర్మటైటిస్, ఆస్తమా, ఫుడ్ అలర్జీ, రైనోకంజంక్టివైటిస్, మందుల అలర్జీ, ఉర్టికేరియా (దద్దుర్లు) వంటి సమస్యలను అధ్యయనం చేశారు. పిల్లల్లో ఫుడ్ అలర్జీ మినహా మిగిలిన అన్ని సమస్యలకు గత కోవిడ్ ఇన్ఫెక్షన్‌తో గణనీయమైన సంబంధం కనిపించింది.
కోవిడ్ తర్వాత అలర్జీ సమస్యలను గుర్తించి, అవసరమైతే త్వరగా చికిత్స అందించేందుకు పర్యవేక్షణ అవసరమని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు పేర్కొన్నారు. రోగనిరోధక వ్యవస్థలో మార్పులు, టైప్-2 ఇన్‌ఫ్లమేషన్, మాస్ట్ సెల్స్ యాక్టివేషన్, శ్వాసకోశాల్లో ఇన్‌ఫ్లమేషన్ వంటి అంశాలు ఈ సంబంధానికి కారణాలు కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే కోవిడ్ వల్లే అలర్జీలు వస్తాయని ఈ అధ్యయనం నిరూపించలేదు. ఇది సంబంధాన్ని మాత్రమే చూపిస్తోందని, కారణాన్ని నిర్ధారించేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!