

తెలంగాణలో సన్నబియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గత నాలుగు నెలల్లో సన్నబియ్యం ధరలు సుమారు 25 శాతం పెరిగాయని పేర్కొన్న ఆయన, నిత్యావసరాల ధరల నియంత్రణలో ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ మరింత సమర్థవంతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. బియ్యంతో పాటు ఉల్లి, వెల్లుల్లి, పప్పులు, వంటనూనె ధరలు పెరుగుతున్నాయని, దీంతో సామాన్య కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందని అన్నారు.
బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, అధిక మార్జిన్లపై తక్షణమే తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు కోరారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వినియోగదారులకు అందుబాటు ధరలో బియ్యం లభించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సన్నబియ్యం సహా నిత్యావసర వస్తువుల ధరలపై సమీక్ష నిర్వహించి ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలని సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!