
.webp&w=3840&q=75)
టీ20 ప్రపంచకప్ విషయంలో పాకిస్థాన్ వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. టోర్నీ కోసం పాకిస్థాన్ జట్టు శ్రీలంకకు వెళ్లనుందని సమాచారం. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జట్టు ఫిబ్రవరి 2న కొలంబోకు చేరుకునే అవకాశం ఉండగా, దీనిపై శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడే సూచనలు ఉన్నాయి. భారత్–శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించడంపై అసంతృప్తితో టోర్నీని బహిష్కరించాలన్న ఆలోచన పాక్‌లో నెలకొన్న సంగతి తెలిసిందే.
ప్రపంచకప్‌లో పాల్గొన్నా భారత్‌తో తలపడకూడదని పాకిస్థాన్ యోచిస్తున్నట్లు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే పాక్ బెదిరింపులకు బీసీసీఐ గానీ, ఐసీసీ గానీ తలొగ్గలేదు. ఎలాంటి సంప్రదింపులు జరపకపోవడంతో పాటు, టోర్నీకి దూరమైతే భారీ నష్టం వాటిల్లుతుందన్న వాస్తవాన్ని పీసీబీ గ్రహించింది. ఈ నేపథ్యంలో జట్టును పంపేందుకు సిద్ధమైంది. పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్, పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వికి సూచించినట్లు సమాచారం. 2027 వరకు భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ తమ మ్యాచ్‌లన్నింటినీ ప్రత్యామ్నాయ వేదికల్లోనే ఆడనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!