

రాబోయే టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోయేది లేదని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తాజాగా స్పష్టం చేశారు. టీ-20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్ ఆడబోయేది లేదని పాకిస్థాన్ భీష్మించుకుని కూర్చుంది. భారత్‌తో తటస్థ వేదికల్లో అయితేనే ఆడతామని ఇంతకు ముందు చెప్పిన పాకిస్థాన్ ఇప్పుడు మాట మార్చింది. తాజాగా భారత్‌తో టీ-20 ప్రపంచకప్‌లో ఆడేది లేదని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా వ్యాఖ్యానించారు. 'టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడకూడదనే విషయంలో చాలా క్లారిటీతో నిర్ణయం తీసుకున్నాం. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు. మేం సరైన నిర్ణయమే తీసుకున్నాం' అని ఇస్లామాబాద్‌లో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. పాక్ తీసుకున్న నిర్ణయాన్ని ఐసీసీ ఇప్పటికే తప్పు పట్టింది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని ప్రకటించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!