

2026 ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ను బహిష్కరించనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన నేపథ్యంలో, టీమ్ ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. గతంలో పాకిస్థాన్ క్రికెటర్లు రిటైర్మెంట్ నిర్ణయాలను వెనక్కి తీసుకున్న తరహాలోనే, ఈ అంశంలోనూ పాకిస్థాన్ యూటర్న్ తీసుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మాజీ ఆటగాళ్ల నుంచి, అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తితే పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకోవడం కొత్త కాదని గావస్కర్ వ్యాఖ్యానించారు.
అయితే, భారత్తో మ్యాచ్ను ఆడకుండా తప్పుకునేందుకు సరైన కారణాలు, ఆధారాలు చూపించలేకపోతే ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని గవాస్కర్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ఈ నెల15 న జరగనున్న మ్యాచ్ కోసం భారత జట్టు షెడ్యూల్ ప్రకారమే శ్రీలంకకు వెళ్లనున్నట్లు సమాచారం. ఒకవేళ పాకిస్థాన్ జట్టు మైదానంలోకి రాకపోతే, మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని భారత జట్టు ఎదురుచూస్తుందని తెలుస్తోంది. ఈ విషయమై బీసీసీఐ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!