
క్రీడలు

ఉత్కంఠభరితమైన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు 5 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ సహిబ్జాదా ఫర్హాన్ అద్భుత శతకం (60 బంతుల్లో 100 పరుగులు, 9 ఫోర్లు, 5 సిక్సర్లు)తో జట్టుకు పటిష్టమైన ఆరంభం అందించగా, ఫఖర్ జమాన్ 42 బంతుల్లో 84 పరుగులు చేసి తొలి వికెట్కు 176 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
లక్ష్యచేదనలో శ్రీలంక కూడా గట్టిగా పోరాడింది. దసున్ షనక 31 బంతుల్లో 76 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడినా, జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులకే పరిమితమైంది. పావన్ రత్నాయకే 58 పరుగులు చేసి సహకరించాడు. బౌలింగ్లో అబ్రార్ అహ్మద్ 3 కీలక వికెట్లు తీసి పాకిస్తాన్కు విజయం అందించాడు. చివరికి మ్యాచ్ 5 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఖాతాలో చేరింది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!