

ఫిబ్రవరి 7 నుంచి భారత్-శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 ప్రపంచ కప్ 2026 కోసం పాకిస్తాన్ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. సల్మాన్ అలీ అఘా నేతృత్వంలో జట్టు ఎంపిక జరిగింది, ఇందులో బాబర్ ఆజం, షాహిన్ అఫ్రిదీ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు, కానీ హారిస్ రౌఫ్ జట్టులో ఉండలేకపోయాడు. బంగ్లాదేశ్ exclusion తర్వాత పాకిస్తాన్ కూడా టోర్నీని బాయ్‌కాట్ చేస్తుందా అనే చర్చలు వచ్చాయి. ICC హెచ్చరికలతో PCB తమ స్థానం స్పష్టం చేసింది.
PCB చీఫ్ మోసిన్ నఖ్వి తెలిపారు, “ప్రభుత్వ నిర్ణయం ప్రకారం PCB నిర్ణయిస్తుంది. అవసరమైతే మరో జట్టును కూడా పంపవచ్చు” అని. ICC పరిస్థితిని సీరియస్‌గా తీసుకుంది, పాకిస్తాన్ వెనక్కి తీసుకోవడం చేస్తే ఆ దేశ క్రికెట్‌పై తీవ్ర ఆంక్షలు విధించవచ్చని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో PCB తమ జట్టును తుది ప్రకటన చేసి, టోర్నీలో పూర్తిగా పాల్గొనడానికి సిద్ధమయ్యింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!