
జనరల్

పలు మీడియా కథనాల ప్రకారం, ఇంగ్లాండ్ తో లార్డ్స్‌లో జరగనున్న మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మకు చివరి వన్డేగా నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన భారత జట్టు ప్రణాళికల్లో రోహిత్‌కు స్థానం లేదని సెలక్షన్ కమిటీ సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశంపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
రోహిత్ శర్మ భారత వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ప్రపంచకప్‌లలో ఆయన ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌లు, రికార్డు స్థాయి ప్రదర్శనలు, నాయకత్వం అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచాయి. ఈ వార్తలు నిజమైతే భారత క్రికెట్‌లో ఓ స్వర్ణయుగానికి ముగింపు పలికినట్టే అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!