

ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్లో జరిగే తొలి టీ20 మ్యాచ్‌కు ముందు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఆసక్తి నెలకొంది. ఈ అంశంపై స్పందించిన భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్.. వైభవ్‌కు అంతర్జాతీయ క్రికెట్లో అవకాశం తప్పకుండా వస్తుందని, అయితే కేవలం అరంగేట్రం చేయించాలనే ఉద్దేశంతో ఇప్పటికే నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వైభవ్‌కు అవకాశం లభిస్తే భారత అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.
వైభవ్ అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడని కోటక్ ప్రశంసించారు. ఐపీఎల్‌తో పాటు పలు టోర్నీల్లో అతను చూపిన ధైర్యవంతమైన బ్యాటింగ్ తన ప్రతిభకు నిదర్శనమని అన్నారు. అయితే జట్టులో ఎంపిక పూర్తిగా జట్టు అవసరాలు, ఆటగాళ్ల ప్రస్తుత ప్రదర్శన ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేశారు. తుది నిర్ణయాన్ని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటారని తెలిపారు. అలాగే వైభవ్‌కు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఉండవని, ఒత్తిడి లేకుండా ఆటను ఆస్వాదిస్తూ జట్టుతో కలిసిపోవాలని మేనేజ్మెంట్ సూచించిందని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!