
సినిమాలు

విపక్షాల ఆందోళనల నడుమ ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించిన అనంతరం సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. ట్రైబ్యునళ్లలో ఛైర్‌పర్సన్లు, సభ్యుల అర్హతలు, నియామక ప్రక్రియలో సమర్థత, పారదర్శకతను పెంచి ఏకరూపత సాధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ బిల్లును రూపొందించారు.
బిల్లులో నేషనల్ ట్రైబ్యునల్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను పొందుపరిచారు. ఒక ఛైర్‌పర్సన్, నలుగురు సభ్యులతో కమిషన్ ఏర్పాటు కానుంది. సభ్యుల్లో ఇద్దరు న్యాయ రంగానికి, మరో ఇద్దరు సాంకేతిక రంగానికి చెందినవారుగా ఉంటారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తిని కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!