

ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం భద్రతా కారణాలతో తమ జట్టును భారత్‌కు పంపేందుకు నిరాకరించడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల చోటుచేసుకున్న భౌగోళిక రాజకీయ పరిణామాలతో సిరీస్‌పై మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రస్తుతం ఇరు దేశాల క్రికెట్ బోర్డులు వరుసగా చర్చలు జరుపుతున్నాయి. దీంతో సిరీస్ మళ్లీ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ బోర్డు ఈ సిరీస్ కోసం ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రత్యేక సమయాన్ని కేటాయించినట్లు సమాచారం.
అయితే సిరీస్ నిర్వహణపై తుది నిర్ణయం భారత కేంద్ర ప్రభుత్వానిదే. బంగ్లాదేశ్ పర్యటనపై కేంద్రం నుంచి అనుమతి, స్పష్టత కోరనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి వర్గాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ తమ దేశం సురక్షితమైనదని, భారత్‌తో సిరీస్‌కు అభిమానుల్లో ఎంతో ఆసక్తి ఉందని తెలిపారు. టీమిండియా పర్యటన కోసం తన పరిధిలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!