

భారత్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్ల్లో పాల్గొనకూడదనే ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రికెటర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ విషయంపై ఆటగాళ్లతో చర్చలు జరిగాయని ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ చేసిన వ్యాఖ్యలను పలువురు క్రికెటర్లు ఖండించారు. తమకు ప్రభుత్వం నుంచి కేవలం ఒక సమాచారం మాత్రమే వచ్చిందని, ఎలాంటి సంప్రదింపులు జరగలేదని వారు స్పష్టం చేశారు.
‘టెలికామ్ ఏషియా స్పోర్ట్’ నివేదిక ప్రకారం, ఢాకాలోని ఓ హోటల్లో గురువారం జరిగిన సమావేశం చర్చల కోసం కాకుండా, ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేయడానికే నిర్వహించారని ఆటగాళ్లు తెలిపారు. “అది చర్చలా అనిపించలేదు. మా అభిప్రాయాన్ని ఎవ్వరూ అడగలేదు. మేము గదిలోకి వచ్చేసరికి నిర్ణయం పూర్తయిపోయింది. ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశం” అని ఓ సీనియర్ క్రికెటర్ ఆవేదన వ్యక్తం చేశారు.
టోర్నమెంట్ నుంచి బహిష్కరణ ప్రమాదం ఉన్నప్పటికీ ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని మరో ఆటగాడు తెలిపారు. తమ అభిప్రాయాలు చెప్పినా, ఫలితం మారదని ముందే అర్థమైందని ఆయన అన్నారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!