
సినిమాలు

టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి తన సొంతూరు గాజువాకలో సందడి చేశారు. భారత్ తరఫున ఆడాలని తన నానమ్మ కలగన్న విషయాన్ని గుర్తు చేసుకున్న ఆయన, ఆ కలను నిజం చేయగలిగినందుకు ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య గడిపిన నితీశ్, తన విజయ ప్రయాణంలో నానమ్మ పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఆమెపై ఉన్న ప్రేమకు గుర్తుగా బంగారు గాజులను బహుమతిగా అందించారు.
ఇటీవల గాయం కారణంగా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు దూరమైన నితీశ్ రెడ్డి తన ఆరోగ్య పరిస్థితిపై కూడా స్పందించారు. ప్రస్తుతం కోలుకుంటున్నానని, మరో నాలుగు నుంచి ఐదు వారాల్లో పూర్తిగా ఫిట్‌గా మారి జింబాబ్వే పర్యటనకు అందుబాటులోకి వస్తానని వెల్లడించారు. త్వరలోనే మైదానంలోకి తిరిగి వచ్చి భారత జట్టుకు సేవలందించాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!