

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియాకు మెంటర్‌గా వ్యవహరించే అవకాశం ఉందనే వార్తలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీసీసీఐ ప్రత్యేకంగా ధోనీని సంప్రదించిందని, జట్టుకు మార్గదర్శకుడిగా వ్యవహరించాలని కోరిందని ప్రచారం జరుగుతోంది. జట్టు ఎంపికకు సంబంధించిన కొన్ని షరతులతో ధోనీ అంగీకరించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం భారత జట్టు కోచింగ్ బృందంలో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా, ర్యాన్ టెన్ డోషేట్ సహాయక కోచ్‌గా, టీ దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా, మోర్నే మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా, సితాంశు కోటక్ బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతుండగా, ధోనీ మెంటర్‌గా చేరే అవకాశమున్నట్లు సమాచారం. అలాగే ఫినిషర్ పాత్ర కోసం రిషభ్ పంత్ ను జట్టులోనే కాకుండా తుది జట్టులో కూడా చోటు కల్పించాలని ధోనీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై బీసీసీఐ లేదా ధోనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!